ఢిల్లీ : జనవరి 22( హింస) లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీకి సంబంధించి ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఢిల్లీ పరిధిలోని 7 లోక్‌సభ స్థానాల్లో 1,47,18,119 మంది ఓటర్లు ఉన్నట్లు ఢిల్లీ ఎన్నికల సంఘం ప్రకటించింది. 18 నుండి 19 సంవత్సరాల వయస్సు గల యువ ఓటర్ల సంఖ్య గణనీయంగా 85 శాతం పెరిగింది. మహిళా ఓటర్ల నమోదు కూడా మెరుగుపడినట్లు పేర్కొంది.1,47,18,119 ఓటర్లలో 79,86,572 మంది పురుషులు, 67,30,371 మంది మహిళలు, 1,176 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. 2023 తుది జాబితాతో పోలిస్తే 58,182 మంది ఓటర్లు తగ్గారు. 2023 తుది ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య 1,47,76,301.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
