దిల్లీ, 06,జనవరి (హిం.స) జ్ఞాన్వాపీ ఆర్కియాలజీ సర్వే నివేదికపై వారణాసి కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఏఎస్ఐ సర్వే రిపోర్టును బహిరంగపరచాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించనుంది. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు నిర్ణయాన్ని బుధవారం నాడు రిజర్వ్ చేసింది. ఈ కేసు తీర్పు గురువారం రావాల్సి ఉంది.. కానీ అది నిన్నటికి (శుక్రవారం) వాయిదా పడింది.. కానీ తుది తీర్పు ఇవాళ వచ్చే అవకాశం ఉంది.
అయితే, జ్ఞాన్వాపీ ఏఎస్ఐ రిపోర్టుపై హిందూ వర్గీయుల చాలా ఉత్సాహంగా ఉన్నారు.. ఈ నివేదికను బహిరంగపరచాలని వారు నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. అయితే, నివేదికను బహిరంగపరచడంపై ముస్లిం పక్షానికి చెందిన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు
హిందూస్తాన్ సమాచార్ /నాగరాజ్
