ఢిల్లీ,03,జనవరి,(హిం.స) హేమంత్ సొరెన్ సన్నిహితుడి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. అక్రమ మైనింగ్ ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ రోజు రాంచీ, రాజస్థాన్లోని 10 ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నాయి. జార్ఖండ్ సీఎం ప్రెస్ అడ్వైజర్ అభిషేక్ ప్రసాద్తో పాటు హజారీబాగ్ డిప్యూటీ ఎస్పీ రాజేంద్ర దుబే, సాహిబ్ గంజ్ జిల్లా కలెక్టర్ రామ్ నివాస్ నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి. రామ్ నివాస్ ఇల్లు రాజస్థాన్లో ఉంది.
అంతకుముందు భూ కుంభకోణంతో సంబంధం ఉన్న మరో కేసులో సీఎం సొరెన్ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని కోరుతూ ఈడీ శనివారం ఏడోసారి సమన్లు జారీ చేసింది. జార్ఖండ్ సీఎం తన స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఇదే చివరి అవకాశం అని సమన్లలో ఈడీ పేర్కొంది. అయితే ఈ సమన్లు చట్టవిరుద్ధమని సొరెన్ ఆరోపించారు. తన ఆస్తుల వివరాలను ఇప్పటికే ఇచ్చానని ఈడీకి లేఖ రాశారు. తన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఈడీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
హిందుస్థాన్ సమాచార నాగరాజ్
