బెంగళూరు, 5 జనవరి (హిం.స) బీజేపీ అధికార ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్సీ అశ్వత్థనారాయణను నియమించారు. రాష్ట్ర బీజేపీ కమిటీలను బలోపేతం చేసే దిశగా అధ్యక్షులు విజయేంద్ర పలు కమిటీలను గురువారం ప్రకటించారు.
అధికార ప్రతినిధులుగా 11 మందిని ఖరారు చేశారు. వీరు ఇకపై పార్టీకు సంబంధించి వివిధ టెలివిజన్ ఛానల్స్లోనే కాకుండా ఇతరత్రా అంశాలపై స్పందిస్తుంటారు. ప్రధాన అధికార ప్రతినిధిగా అశ్వత్తనారాయణను మరోసారి కొనసాగించారు.
సీనియర్ పాత్రికేయుడు హరిప్రకాష్ కొణెమనె, ఎమ్మెల్సీలు ఛలవాది నారాయణస్వామి, తేజస్వినీగౌడ, కెఎస్ నవీన్, ఎంజీ మహేష్, హెచ్ఎన్ చంద్రశేఖర్, డాక్టర్ నరేంద్రరంగప్ప, సురభి హూదిగెరె, అశోక్ కెఎంగౌడ, హెచ్.వెంకటే్ష దొడ్డేరిలు ఉన్నారు. ఇక సోషల్ మీడియా కోఆర్డినేటర్గా ప్రశాంత్ మాకనూరు. సహ సంచాలకులుగా నరేంద్రమూర్తిలను నియమించారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా
