న్యూఢిల్లీ, 20 ఆగస్టు (హి.స.)
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరపున సీపీ రాధాకృష్ణన్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రసాయనాలు మరియు ఎరువుల శాఖామంత్రి జేపీ నడ్డా, హోం శాఖ మంత్రి అమిత్ షా, ఉపరితల రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు.
—————
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
