ఢిల్లీ, 01 జనవరి (హి.స.)ప్రధాని నరేంద్రమోదీ దేశప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలని ఆకాంక్షించారు
2025కు వీడ్కోలు పలికి.. కొత్త ఆశలతో ప్రపంచమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 2026లో దేశ ప్రజలు చేసే అన్ని ప్రయత్నాలు విజయవంతం కావాలని, మంచి ఆరోగ్యం, శ్రేయస్సు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. సమాజమంతా శాంతి, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ లో రాసుకొచ్చారు.
—————
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV
