ఢిల్లీ : బిగ్‌బాస్ ఓటీటీ విన్నర్ ఎల్విష్ యాదవ్‌ను రేవ్ పార్టీ కేసులో అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రశ్నించేందుకు యాదవ్‌ను పిలిచిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఎల్విష్ యాదవ్‌ను అధికారులు మరికాసపట్లో కోర్టు ఎదుట హాజరు పరచనున్నారు. గత ఏడాది రేవ్ పార్టీల్లో రిక్రియేషనల్ డ్రగ్‌గా వాడేందుకు పాము విషాన్ని సమకూర్చారనే ఆరోపణలపై ఎల్విష్ సహా ఐదుగురిపై నోయిడాలో వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది.
