తిరుపతి-పాకాల-కాట్పాడి రైలు మార్గంలో 104 కిలోమీటర్ల డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌తో రాయలసీమ రీజియన్‌కు పెద్ద స్థాయిలో ప్రయోజనాలు కలుగనున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రూ.1332 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి, ఉపాధి, పర్యాటక రంగం, పారిశ్రామిక వృద్ధికి బలాన్ని ఇచ్చే అవకాశముంది.
BulletsIn
-
తిరుపతి-పాకాల-కాట్పాడి మధ్య 104 కిమీ రైల్వే డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
-
ఈ ప్రాజెక్టు కోసం రూ.1332 కోట్లు కేటాయించారు.
-
ఈ పనుల ద్వారా 35 లక్షల పనిదినాలు కల్పించే అవకాశం ఉంది.
-
ప్రాజెక్టు లబ్ధిదారులు మొత్తం 14 లక్షల మందికి పైగా, వీరిలో 400 గ్రామాల ప్రజలు ఉంటారు.
-
తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోటల వంటి పర్యాటక ప్రదేశాలకు మరింత వృద్ధి కలుగుతుంది.
-
తిరుపతి, వెల్లూరు వంటి ప్రాంతాలు వైద్య, విద్యా కేంద్రాలుగా మరింత అభివృద్ధి చెందుతాయి.
-
ఎలక్ట్రానిక్స్, సిమెంట్, స్టీల్ పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది.
-
చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాలకు ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం లభిస్తుంది.
-
ప్రాజెక్టులో భాగంగా 17 మేజర్, 327 మైనర్ వంతెనలు, 7 పైవంతెనలు, 30 అండర్ పాస్‌లు నిర్మించనున్నారు.
-
రైలు మార్గం అభివృద్ధితో 20 కోట్ల కిలోల కార్బన్‌డయాక్సైడ్ ఉద్గారాన్ని తగ్గించడమే కాక, 4 కోట్ల లీటర్ల డీజిల్ పొదుపు, 4 మిలియన్ టన్నుల సరుకు రవాణా అవకాశాలు ఉన్నాయి.
