దిల్లీ,15,మార్చి (హిం.స)వచ్చే వారం ప్రధాని నరేంద్రమోడీ భూటాన్ దేశ పర్యటకు వెళ్లనున్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్ చేసిన ఆహ్వానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. గురువారం న్యూఢిల్లీలో భూటాన్ ప్రధాని షేరింగ్ టోబ్గేతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఇరు దేశాల సంబంధాలు, భాగస్వామ్యంపై ఇరువురు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో రాజు వాంగ్చుక్ తరపున అధికారిక ఆహ్వానాన్ని భూటాన్ ప్రధాని టోబ్గే, ప్రధాని మోడీకి అందించారు. దీనికి మోడీ ఓకే చెప్పారు. అయితే, పర్యటన అధికారిక తేదీలను విదేశాంగ శాఖ తర్వలో విడుదల చేసే అవకాశం ఉంది.
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ, ఇంధనం, జలవిద్యుత్ సహకారం, ప్రజలతో ప్రజల మార్పిడి మరియు అభివృద్ధి సహకారంతో సహా వివిధ రంగాలలో పురోగతిని సమీక్షించారు.
