ఢిల్లీ : 6ఫిబ్రవరి ( హింస) మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హర్దా పట్టణంలో గల ఓ పటాకుల తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 90 మందిదాకా గాయపడ్డారు. క్షతగాత్రులు హర్దా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
