విజయనగరం(ఆంధ్రప్రదేశ్), మార్చి జలం లేనిదే జీవకోటికి మనుగడ లేదని, ప్రకృతి ప్రసాదించిన నీటిని దుర్వినియోగం చేయకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత మనుషులపై ఉందని పలువురు వ్యక్తలు పేర్కొన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి, స్నేహచైత్ర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైన మరిశర్ల కృష్ణమూర్తి నాయుడు ఇచ్చిన పిలుపుకు స్పందించి పెదపెంకి గ్రామంలో నేతాజీ గ్రంథాలయం వద్ద స్నేహచైత్ర ఫౌండేషన్ కార్యదర్శి, నేతాజీ గ్రంథాలయం స్థాపకుడు ఈర్ల సంజీవ్ నాయుడు మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉద్యమ స్ఫూర్తితో నీటి వనరుల పరిరక్షణకై ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పి.శ్రీను, కోట గౌరీనాథ్, బి.గోవింద్, ఆర్.చిన్న, ఎస్.నాయుడు, పి.ప్రతాప్, జి.పోలినాయుడు, గణపతి, గంట సాధు, జి.శ్రావణ్, పి.పరుశురామ్, బి.వెంకటరమణ, జి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.
