ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అనర్హతకు గురైన ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనర్హతను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్‌పై ఈ నెల 18న విచారణ జరుపనున్నది. ఆరుగురు ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా విప్‌ను ధిక్కరించినందుకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు అనుకూలంగా ఓటు వేసిన కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆ తర్వాత బడ్జెట్‌పై ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
