ఢిల్లీ పెట్రోల్-డీజిల్ రేట్లతో అల్లాడుతున్న జనాలకు కేంద్రం ఇటీవల తీపి కబురు చెప్పింది. లీటర్‌పై రూ.2 తగ్గించింది. అయితే, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఎంత తగ్గించినా, రేట్లు మాత్రం ఇంకా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పరిశీలిస్తే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లోనే ఇంధన ధరలు ఎక్కువగా ఉండగా.. అండమాన్ అండ్ నికోబార్, ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో విధిస్తున్న పన్నులు లేదా వాట్ ఆధారంగా ఈ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి.
కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 కన్నా ఎక్కువగానే ఉంది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.87 కాగా.. లెఫ్ట్ ఫ్రంట్ అధికారంలో ఉన్న కేరళలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.54గా ఉంది. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో రూ. 107.39గా ఉంది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రూ. 106.45గా, జేడీయూ-బీజేపీ అధికారంలో ఉన్న బీహార్‌లో రూ.105.16గా, రాజస్థాన్ లో రూ. 104.86 గా, మహారాష్ట్రలో రూ. 104.19 గా పెట్రోల్ ధరలు ఉన్నాయి. టీఎంసీ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.93గా, ఒడిశాలో రూ. 101.04, తమిళనాడులో రూ. 100.73గా, ఛత్తీస్‌గఢ్‌లో రూ. 100.37గా రేట్లు ఉన్నాయి.
దేశవ్యాప్తంగా పరిశీలిస్తే కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యంత చౌకగా పెట్రోల్ లభిస్తోంది. ఇక్కడ ధర రూ. 82 కాగా, సిల్వాస్సా-డామన్‌లో లీటర్ ధర రూ. 92.38, రూ. 92.49గా ఉంది. ఢిల్లీలో రూ. 94.76, పనాజీ రూ. 95.19, అస్సాంలో రూ.
