దిల్లీ, గోవాలో బీజేపీ అభ్యర్థి పల్లవి డెంపో సరికొత్త ఘనత సాధించారు. గోవా నుంచి ఎన్నికల బరిలో నిలిచిన తొలి మహిళగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి బీజేపీ తాజాగా మరో జాబితాను రిలీజ్ చేసింది. 111 మందితో ఆదివారం నాడు విడుదలైన జాబితాలో గోవా నుంచి ఓ మహిళకు ఎంపీ టికెట్ ఇచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, డెంపో ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పల్లవి డెంపోను దక్షిణ గోవా నుంచి బీజేపీ బరిలోకి దింపింది.
ఇక, గోవా రాష్ట్రంలో బీజేపీ టికెట్పై లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి మహిళగా పల్లవి డెంపో చరిత్రకెక్కారు.
