అయోధ్య. (హిం.స)లోని అయోధ్య బాల రాముడికి ఓ భక్తుడు సుమారు రూ.5 కోట్ల విలువ చేసే ఏడు కిలోల ‘బంగారు రాణాయణాన్ని’ కానుకగా ఇచ్చారు. 500 బంగారు పేజీలపై రాసిన ఈ రామాయణాన్ని అయోధ్య ప్రధానాలయంలో ఉంచారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ సమయంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ్ తన జీవిత సంపాదన మొత్తాన్ని బాల రాముడికి అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఆ మాట ప్రకారం ఆయన రూ.5 కోట్లు ఖర్చు చేసి 151 కిలోల బరువున్న రామచరిత మానస్(రామాయణం)ను సిద్ధం చేయించారు. 10,902 శ్లోకాలతో కూడిన ఈ బంగారు రామాయణానికి సంబంధించిన ప్రతి పేజీపై 24 క్యారెట్ల బంగారు పూత పూశారు. దీని తయారీలో 140 కిలోల రాగిని కూడా వినియోగించారు. మరోవైపు రామమందిరంలో కలశ స్థాపనతో 9 రోజుల శ్రీ రామనవమి వేడుకలు ప్రారంభం అయ్యాయి.
