, అహ్మదాబాద్ 25,డిసెంబర్ (హిం.స) ఒకవేళ భారత్ బిడ్ను ఒలింపిక్స్ కమిటీ అంగీకరిస్తే సర్దార్ పటేల్ కాంప్లెక్స్లో 2036 ఒలింపిక్స్ జరుగుతాయి. ఇప్పటికే దీనికి రూ.4,600 కోట్లను ప్రధాని కేటాయించారు’ అని అమిత్ షా తెలిపారు.గుజరాత్లోని అహ్మదాబాద్లో 2036 ఒలింపిక్స్ నిర్వహణపై కేంద్ర హోం మంత్రి అశాభావం వ్యక్తం చేశారు. నగరంలోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం సమీపంలో ఉన్న సర్దార్ పటేల్ కాంప్లెక్స్ ఇందుకు వేదిక కావొచ్చని వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్కు బిడ్ సమర్పిస్తామని ఇప్పటికే ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు
హిందుస్థాన్ సమాచార,నాగరాజ్
