దిల్లీ: 9 జూలై (హి.స.) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-7 ప్రమాదంపై ఎన్‌టీఎస్‌బీ సాయంతో భారత విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ)దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రస్తుత తరుణంలో ఊహాగానాలకు దూరంగా ఉండాలని ఏఏఐబీ, ఎయిర్ ఇండియా సీఈఓ కాంప్‌బెల్ విల్సన్ ప్రజలను కోరారు. ‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ఇటీవలి మీడియా నివేదికలు ఊహాజనితమైనవి. ఏఏఐబీ తన ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. పూర్తి దర్యాప్తునకు ఇంకా సమయం పడుతుంది. ఏఏఐబీ కొనసాగుతున్న దర్యాప్తుకు మద్దతు ఇస్తున్నాం’ అని ఎన్‌టీఎస్‌బీ ‘ఎక్స్’లో ఒక పోస్టులో తెలిపింది.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
