పెద్దపల్లి, 12 ఆగస్టు (హి.స.)
తెలంగాణలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ దంపతులు గట్టు వామనరావు, గట్టు నాగమణి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు ఇచ్చింది. పెద్దపల్లి జిల్లా మంథనిలో 2021 ఫిబ్రవరి 17న వామనరావు, నాగమణి కారులో వెళ్తుండగా అడ్డగించి నడిరోడ్డుపై కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు అదే ఏడాది సెప్టెంబర్ 18న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించిన వీడియోలు సహా అన్ని పత్రాలు తమ ముందు ఉంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలో ఆదేశించింది. రికార్డులను పరిశీలించి సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సంబంధిత వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు చనిపోయే ముందు వామనరావు మాట్లాడిన మరణ వాంగ్మూలం వీడియో వైరల్ అయింది. దీనిపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. వామనరావు మరణ వాంగ్మూలం వీడియో అసలుదేనని ఎఫ్ఎస్ఎల్ నివేదిక తేల్చిందని ఇందుకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు ఇస్తే తమకేమి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వామనరావు తండ్రి కిషన్ రావుకు భద్రత కల్పించాలని ఆదేశించింది. సమర్పించింది.
—————
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్
