ఢిల్లీ ,02, జనవరి (హిం.స) జపాన్ తర్వాత మయన్మార్లో కూడా భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, జనవరి 2న మయన్మార్లో 3:15 నిమిషాల 53 సెకన్లకు భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం 85 కిలోమీటర్ల దిగువన ఉంది. సోమవారం, కొత్త సంవత్సరం రోజు కేవలం 18గంటల్లో జపాన్లో 150కి పైగా ప్రకంపనలు సంభవించాయి. దీంతో తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్లో భూకంపం కారణంగా ఇప్పటివరకు 8 మంది మరణించారు. రానున్న కాలంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమాచార్ ,నాగరాజ్
