ఢిల్లీ23డిసెంబర్ (హి.స.) తరచూ దుందుడుకు చర్యలకు పాల్పడే చైనాకు భారత్ అడ్డుకట్ట వేస్తోంది. చైనా సరిహద్దు వెంబడి భారత్ మరో భారీ వ్యూహాత్మక అడుగు వేసింది. ఉత్తరాఖండ్‌లోని నీలపాణి నుండి ములింగ్ లా వరకు 16,134 అడుగుల అత్యంత ఎత్తైన ప్రాంతంలో 32 కిలోమీటర్ల మేర నిర్మితమవుతున్న‘మెగా రోడ్డు’ పనులను భారత్ ముమ్మరం చేసింది. అన్ని వాతావరణాలను తట్టుకునేలాంటి రహదారి నిర్మాణాన్ని చేపట్టింది. రూ. 104 కోట్ల వ్యయంతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) చేపడుతున్న ఈ ప్రాజెక్టు, వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)వద్ద భారత సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచనున్నది.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
