చెన్నై, 17 నవంబర్ (హి.స.)తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ నివాసంతో పాటు, సినీ నటులు అజిత్ కుమార్, అరవింద్ స్వామి, ఖుష్బు నివాసాలకు ఆదివారం రాత్రి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు ఈ-మెయిల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) కార్యాలయానికి కూడా రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై ఈ నాలుగు ప్రాంతాలలోనూ భద్రతా తనిఖీలను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా నటుడు అజిత్ కుమార్ చెన్నైలోని ఇంజాంబాక్కంలో ఉన్న నివాసానికి గత వారం కూడా గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఇలాంటి బాంబు బెదిరింపు వచ్చింది. తాజాగా మళ్లీ బెదిరింపు రావడంతో పోలీసులు ఈ అంశాన్ని మరింత సీరియస్‌గా తీసుకున్నారు.
బెదిరింపు మెయిల్ అందిన వెంటనే పోలీసు అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి ఆయా ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఆ తనిఖీలలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో ఈ బెదిరింపులన్నీ బూటకం (Hoax) అని అధికారులు ధృవీకరించారు
—————
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు
