దిల్లీ: 8 ఆగస్టు (హి.స.) చట్ట పరిమితులకు లోబడి ఈడీ పనిచేయాలే తప్ప దుండగుడిలా ప్రవర్తించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ సంస్థ చేపట్టిన కేసుల్లో నేర నిరూపణ శాతం తక్కువగా ఉన్న విషయాన్ని ఎత్తిచూపింది. ఈడీ ప్రతిష్ఠ దిగజారుతోందని తామూ ఆందోళన చెందుతున్నట్టు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం పేర్కొంది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద అరెస్టు చేయడానికి, ఆస్తుల జప్తునకు ఈడీకి అధికారం ఉందంటూ 2022లో వెలువడిన తీర్పుపై సమీక్ష పిటిషన్లను గురువారం విచారణకు చేపడుతూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
3
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
