



ఢిల్లీ : 20 జనవరి (హిం.స)అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఓవైపు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతుండగా.. అత్యవసర సమయాల్లో వైద్యసేవలు అందించేందుకు విపత్తుల చిరు ఆస్పత్రి ‘భీష్మ్’ను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది.
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ సమగ్ర వైద్యసేవలు అందించనున్నట్లు పేర్కొంది. దేశీయంగా రూపొందించిన ఈ ఆరోగ్యమైత్రి విపత్తుల నిర్వహణ చిరు ఆసుపత్రి ‘భీష్మ్’ ఘనాకారంలో ఉంటుంది. అత్యవసర సమయాల్లో వైద్యం అందించేందుకు ఇందులో అత్యాధునిక పరికరాలు ఉంటాయి. కృత్రిమ మేధ, అంతర్జాల సాంకేతికత సాయంతో ఈ ఆసుపత్రి సమర్థవంతమైన సేవలను అందిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
హిందూస్తాన్ సమాచార, రాజీవ్
