ఢీల్లీ, 3 జనవరి (హిం.స) అయోధ్య ను 14 వేల సంవత్సరాల పాటు సుభిక్షంగా పరిపాలించి ”రామరాజ్యం” అనే పేరును సుస్థిరం చేసిన శ్రీరాముడు తిరిగి రామజన్మభూమిలో కొలువు తీరుతున్న మధుర క్షణాల కోసం భరతజాతి ఎదురుచూస్తోంది.
మా తరంలో రాముడి గుడి చూడగలమా అని వేలాది మంది ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామజన్మభూమిలో నిర్మించిన భవ్య రామమందిరంలో రాముడు కొలువుతీరుతున్నాడు. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని ”నభూతో నభవిష్యతి” అనేలా నిర్వహించేందుకు యూపీ సర్కార్ ‘శబరి హోటళ్లు’, ‘గుహుడి సత్రం’ పేరుతో…ముఖ్యంగా రామాయణం లోని ప్రధాన పాత్రల పేర్లు గుర్తొచ్చేలా, వివిధ భాషల్లో ఏర్పాటు చేసిన సైన్బోర్డులతో సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ తరుణంలో రామాలయం కోసం రామభక్తులు ఏళ్లుగా చేసిన ప్రతినలు, జ్ఞాపకాలు అందరి కళ్లముందు మొదలుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 30 ఏళ్ల క్రితం రామాలయం కోసం చేసిన ప్రతిన, ఆ కల నేటికి సాకారం కానుండటం మరోసారి దేశ ప్రజానీకం నెమరువేసుకుంటోంది.
హిందూస్తాన్ సమాచార్, సంధ్యా
