ఢిల్లీ : జనవరి 18( హింస ) ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీతో అవగాహనను వ్యతిరేకిస్తూ ఆప్ దళిత నేత గురువారం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీతో విభేదిస్తూ రాజీనామా చేస్తున్నానని ఆప్ క్యాంపెయిన్ కమిటీ చీఫ్, హరియాణకు చెందిన దళిత నేత అశోక్ తన్వర్ వెల్లడించారు.పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తన్వయ్ తన రాజీనామా లేఖ పంపారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కాంగ్రెస్‌తో ఆప్ సంప్రదింపులను తన్వర్ తప్పుపట్టారు. కాంగ్రెస్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ చర్చల నేపధ్యంలో ఇక పార్టీలో కొనసాగేందుకు తాను నమ్ముకున్న నైతిక విలువలు అనుమతించవని, తన రాజీనామాను ఆమోదించాలని లేఖలో తన్వర్ కేజ్రీవాల్‌ను కోరారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార
