హైదరాబాద్, 04 జనవరి (హి.స.) వెనుజులాలో ఉద్రిక్త వాతావరణం
నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ కీలక అడ్వైజరీ జారీ చేసింది. భారత పౌరులు అత్యవసరం అయితే తప్ప వెనుజులాకు వెళ్లవద్దని సూచించింది. అంతే కాకుండా వెనుజులాలో ఉన్న భారీతీయులు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఏదైనా సమస్య ఉంటే కారకస్ లోని ఇండియన్ ఎంబసీని సంప్రదించాలని తెలిపింది. cons.caracas@mea.gov.in లేదా ఫోన్ నెం. +58-412-9584288 కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
