క్రాన్స్ మోంటానా, 01 జనవరి (హి.స.) నూతన సంవత్సరం వేళ స్విట్జర్లాండ్
లో పెను విషాద ఘటన చోటుచేసుకుంది. బార్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతుండగా.. స్థానిక కాలమానం ప్రకారం గత అర్థరాత్రి 1.30 గంటలకు భారీ శబ్దంతో పేలుడు జరిగింది. స్కీ రిసార్ట్ నగరం క్రాన్స్ మోంటానాలో ఉన్న బార్ లో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 40కి చేరిందని అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. పోలీసులు, రెస్క్యూ టీమ్స్, అగ్నిమాపక సిబ్బంది స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బార్ లో 100 మందికి పైగా ప్రజలు ఉన్నట్లు సమాచారం.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..
