body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}జబల్‌పుర్,04జనవరి (హి.స.)
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్‌లో జరుగుతున్న ప్రపంచ రామాయణ సదస్సులో రామాయణ ఇతివృత్తాలతో 20 దేశాలు విడుదల చేసిన స్టాంపుల ప్రదర్శన ఆకట్టుకుంటోంది. ఈ స్టాంపుల్లో సీతారాములతోపాటు రావణుడు, మేఘనాథుడు, హనుమంతుడు వంటి పాత్రలు కూడా ఉన్నాయి. జబల్‌పుర్‌కు చెందిన సతీశ్‌కుమార్ శ్రీవాస్తవ ఉద్యోగ విరమణ తర్వాత ఫిలాటెలిస్టుగా (స్టాంపుల సేకర్తగా) మారి రామాయణ సంబంధిత పోస్టల్ స్టాంపుల సేకరణలో నిమగ్నమయ్యారు. భారత్‌తోపాటు నేపాల్, భూటాన్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇండోనేసియా, మారిషస్ వంటి దేశాలకు రామాయణంతో బలమైన సాంస్కృతిక సంబంధాలున్న విషయం తెలిసిందే. ఈ దేశాలన్నీ రామాయణ సన్నివేశాలతో వివిధ సందర్భాల్లో విడుదల చేసిన స్టాంపులను సతీశ్‌కుమార్ సేకరించి ప్రదర్శిస్తున్నారు. అయోధ్యలోని రామ్‌లల్లాపై లావోస్ విడుదల చేసిన పోస్టల్ స్టాంపు సైతం ఇందులో ఉంది. ఇతర దేశాల పోస్టల్ స్టాంపులు ఆర్డర్ చేసినప్పుడు ఒకట్రెండు కాకుండా.. మొత్తం సిరీస్ కొనాల్సి ఉంటుంది.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
