బెంగళూరు, 27 నవంబర్ (హి.స.)ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ WinZO వ్యవస్థాపకులు అయిన సౌమ్య సింగ్ రాథోడ్, పవన్ నందా (Paavan Nanda) లను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ WinZO వ్యవస్థాపకులు గత కొంత కాలంగా.. మనీ లాండరింగ్ ఆరోపణల ఎందుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో సోధాలు నిర్వహించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు తగిన ఆధారాలు లభించిన తర్వాత.. బుధవారం రాత్రి వారిని అరెస్టు చేశారు. అలాగే బెంగళూరులోని ED జోనల్ కార్యాలయంలో ఇద్దరిని విచారించినట్లు ఈడీ అధికారులు ఈ రోజు గురువారం ఉదయం మీడియాకు తెలిపారు.
అరెస్టు అనంతరం వారిద్దరినీ అదే రాత్రి బెంగళూరులోని స్థానిక కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారికి ఒక రోజు కస్టడీ విధించింది. తదుపరి ఉత్తర్వుల కోసం వారిని తిరిగి కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
గత వారం WinZO, Gamezkraft సంస్థలపై దాడులు నిర్వహించిన ED, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్య తీసుకుంది. వినియోగదారులు నిజమైన వ్యక్తులతో కాకుండా సాఫ్ట్‌వేర్ అల్గారిథమ్స్‌తో ఆడుతున్నారనే వాస్తవాన్ని దాచిపెట్టి, WinZO ‘క్రిమినల్ కార్యకలాపాలు, అక్రమ పద్ధతుల్లో’ పాల్గొంటుందని ED ఆరోపించింది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV
