డిల్లీ, 17 నవంబర్ (హి.స.)దేశంలో ఆయా రాష్ట్రాల్లో చలి గాలులు తీవ్రంగా ఉంటాయని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. మధ్య, పశ్చిమ భారతదేశంలో తీవ్రమైన పరిస్థితులు ఉంటాయని హెచ్చరించింది. మధ్యప్రదేశ్‌లో చాలా తీవ్రంగా ఉంటుందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక దక్షిణాదిలో వర్షాలతో పాటు చలి గాలులు కూడా ఉంటాయని తెలిపింది. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో తీవ్ర పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. విపరీతమైన చలిగాలులు ఉంటాయని స్పష్టం చేసింది.
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్‌లో నవంబర్ 17 నుంచి 19 మధ్య ఉష్ణోగ్రతలు చాలా దారుణంగా పడిపోతాయని పేర్కొంది. ఇక సోమవారం పశ్చిమ మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్‌లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీలు నమోదైంది. దేశంలోనే అత్యంత చలి ప్రాంతం ఇదేనని తెలిపింది. ఇక ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, గుజరాత్‌లో కూడా తీవ్ర పరిస్థితులు ఉంటాయని చెప్పింది.
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. తమిళనాడు, కేరళ, కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ, అండమాన్ మరియు నికోబార్ దీవులలో తేలికపాటి నుంచి మితమైన వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది నవంబర్ 18 నుంచి 22 వరకు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని.. నవంబర్ 17న అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది
—————
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు
