పథనంథిట్ట:ఢిల్లీ,22,, అక్టోబర్ (హి.స.) కేరళ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం ప్రసిద్ధ శబరిమల ఆలయ దర్శనానికి వెళ్లారు. అయితే, ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా.. హెలిప్యాడ్ ఉన్నట్టుండి కుంగిపోయింది. ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు.
నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) మంగళవారం సాయంత్రం తిరువనంతపురం చేరుకున్నారు. బుధవారం ఉదయం పథనంథిట్టకు వచ్చారు. ఈ క్రమంలోనే ప్రమదం ప్రాంతంలోని రాజీవ్‌గాంధీ ఇండోర్ స్టేడియంలో హెలికాప్టర్ దిగుతుండగా.. హెలిప్యాడ్ కుంగిపోయింది. దీంతో హెలికాప్టర్ చక్రం అందులో ఇరుక్కుపోయింది.
అప్రమత్తమైన భద్రతా సిబ్బంది రాష్ట్రపతిని సురక్షితంగా హెలికాప్టర్ నుంచి దించారు. అనంతరం ఆమె రోడ్డు మార్గంలో పంబకు (President Droupadi Murmu Sabarimala Visit) బయల్దేరారు. హెలికాప్టర్ చక్రాన్ని బయటకు తీసేందుకు పలువురు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దాన్ని తోస్తున్న చిత్రాలు పలు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యాయి.
4
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
