ఢిల్లీ,22,, అక్టోబర్ (హి.స.) ప్రపంచంలో శాంతి, మానవతా విలువల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ (Sri Sri Ravi Shankar)కు అరుదైన గౌరవం దక్కింది. సమాజానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ.. అమెరికాలోని సియాటెల్ నగరం అక్టోబర్ 19వ తేదీని ‘శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవం’ గా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మానసిక ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నిర్మించడం, వివిధ మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడం, సమాజంలో విలువలు పెంచేందుకు ఆయన చేసిన కృషికి గాను ఈ గౌరవాన్ని ప్రకటిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అమెరికాలోని వాంకోవర్ నగరం కూడా అక్టోబర్ 18వ తేదీని గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ దినోత్సవంగా ప్రకటించింది.
ఒత్తిడి, హింస లేని సమాజాన్ని నెలకొల్పాలనే గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో 8 కోట్ల మందికి పైగా ప్రజలను ప్రభావితం చేసిందని సియాటెల్ నగర మేయర్ బ్రూస్ హారెల్, వాంకోవర్ మేయర్ కెన్ సిమ్ పేర్కొన్నారు. రవిశంకర్ స్థాపించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నిర్వహించిన ఒత్తిడి నిర్మూలన, యువ నాయకత్వ, సామాజిక అభివృద్ధి, సేవా కార్యక్రమాలు ప్రజల్లో మానసిక దృఢత్వం, ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో సంఘర్షణల నివారణ, శాంతియుత వాతావరణం, మహిళా సాధికారికతను పెంపొందించాయన్నారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
