అనంతపురం, 9 సెప్టెంబర్ (హి.స.):సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో కూటమి ప్రభుత్వం రేపు భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి పార్టీ పేరుతో నిర్వహిస్తున్న సభ కావడంతో ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యమైన టీడీపీ నేతలు ఇప్పటికే ఈ సభ కోసం అనంతపురానికి చేరుకున్నారు.సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి జెండాలతో అనంతపురం రెపరెపలాడుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరవుతారని నాయకులు భావిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అనంతపురంలోని ఏర్పాట్లపై పర్యవేక్షణ చేస్తున్నారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
