అమరావతి, 22 ఆగస్టు (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి టీడీపీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టే పనిలో పడ్డారు నాయకులు. దానికోసం రాష్ట్ర మంత్రులు, సీఎం చంద్రబాబు కేంద్రమంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ.. రాష్ట్ర సమస్యలను వివరిస్తూ.. పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు సీఎం చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ పలువురు కేంద్రమంత్రులను ఆయన కలవనున్నారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
