నెల్లూరు, 21 ఆగస్టు (హి.స.)
:టీడీపీ నేత, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి బెదిరింపులు వచ్చాయి. తనకు రూ. 2 కోట్లు ఇవ్వాలని.. లేకుంటే చంపేస్తామంటూ ఆమెకు బెదిరింపులు అందాయి. నెల్లూరులోని వేమిరెడ్డి నివాసం వద్ద.. భద్రతా సిబ్బందికి దుండగుడు ఒక లేఖ ఇచ్చి వెళ్లిపోయాడు. దీంతో ఆ లేఖను వేమిరెడ్డి కార్యాలయ సిబ్బంది తెరిచి చూశారు. అందులో ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు దిగడంతో.. ఈ విషయాన్ని ఆమెకు తెలియజేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
