చెన్నై: 9 జూలై (హి.స.)కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యేళ్లతరబడి భాష, విద్య, నిధుల విషయంలో అనుసరిస్తున్న నిర్ల్యక్ష వైఖరిని ఖండిస్తూ ఉభయ సభల్లో గళమెత్తాలని డీఎంకే ఎంపీలకు ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) దిశానిర్దేశం చేశారు. ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో తేనాంపేటలోని అన్నా అరివాలయంలో శుక్రవారం ఉదయం లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల సమావేశం జరిగింది. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ ఎంపీలు ఎలా ప్రవర్తించాలనే విషయమై సీఎం దిశానిర్దేశం చేశారు
—————
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ
