నిర్మల్ మే : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలకు గ్యారంటీలను ఇచ్చామని, వాటిని పూర్తిగా అమలు చేస్తున్నామని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ తెలిపారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఆరోపించారు. దాంతో పాటు రిజర్వేషన్లు రద్దు చేస్తారని అన్నారు. పేదల హక్కులను హరించి, పెద్దలకు ప్రయోజనం చేకూర్చడమే కమలం పార్టీ లక్ష్యమని మండిపడ్డారు. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని నిర్మల్లో ఆదివారం కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రస్తుత భారత పార్లమెంటు లోక్సభ
ఎన్నికలు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయని అన్నారు. ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షించే కాంగ్రెస్ ఉంటే, మరోవైపు భారత రాజ్యాంగాన్ని మార్చే సమూహం ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారానే దేశ ప్రజలకు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారని, హక్కులు సంక్రమించాయని చెప్పారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆరోపించారు.కేంద్రంలో కాంగ్రెస్ వస్తే దేశవ్యాప్తంగా మహిళలకు ఆర్థికసాయం చేస్తాం. భారతదేశంలో పేదల జాబితాను తయారు చేస్తున్నాం. ప్రతి పేద కుటుంబం నుంచి మహిళ పేరును ఎంపిక చేసి వారి ఖాతాలో రూ.లక్ష వేస్తాం. ఆదివాసీలు అంటే భూమిపై అన్ని హక్కులు కలిగి ఉన్నవారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉంది ప్రజల పక్షాన ఆలోచిస్తుంది.
. తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు రూ.2500 బ్యాంక్ ఖాతాలో వేస్తామని, ఆరోగ్య భద్రత రూ.10 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని హామీ ఇచ్చారు. పేదలకు రూ. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుల^ అందిస్తున్నామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.
