చత్తీస్ గఢ్ మే : గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి చెందారు.మంచిర్యాలకు చెందిన రవి అలియాస్ వినయ్,చీరాల నర్సయ్య, తిక్క సుష్మిత అనే ముగ్గురు మరణించారు. రవిపై రూ. 8 లక్షల రివార్డు,
గోపన్న అలియాస్ చీమల నర్సయ్యపై రూ.25 లక్షల రివార్డ్, తిక్క సుష్మితపై రూ.2 లక్షల రివార్డుల ఉన్నాయి. తాజాగా నారాయణపుర్ జిల్లా అబూజ్మడ్ అరణ్యంలో కాల్పుల మోత మోగుతోంది. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు
మావోయిస్టులు మృతి చెందారు.
అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయ్యారనే సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. దీంతో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు చోటు చేసుకోవడంతో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఎన్నికల టైంలోనూ భద్రతా బలగాలు నిర్విరామంగా మావోయిస్టులను సెల్ఫ్ డిఫెన్స్ లో ఉంచే వ్యూహాన్ని అమలుచేస్తున్నాయి.
