శ్రీకాకుళం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్పే ద ప్రజల జన సంక్షేమం అభివృద్ధి చేపట్టిన ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టాలని పాతపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి అభ్యర్థి రెడ్డి శాంతి కోరారు. పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని మెలియాపుట్టి మండలం జోడూరు పంచాయతీ రాజపురం నందలపాడు కాపు సజ్జనాపురం ఎన్ని బంధ సవర సజ్జనాపురం అర్చనాపురం జోడూరు గ్రామాల్లో గురువారం విస్తృతస్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న జగనన్నకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి నీ అభిమానాన్ని చూపాలని ఆమె కోరారు. ఆమెతో పాటు పలువురు వైయస్సార్సీపి నాయకులు పాల్గొన్నారు.
