విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్అం దరినీ కలుపుకొంటేనే తూర్పు నియోజక వర్గంలో వైసిపి గెలుపు సాధ్య మవుతుంది అని వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ నిర్మాత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం లో రానున్న ఎన్నికల్లో వైసీపీ ని మరింత బలోపేతం చేసే దిశగా తాము చేపట్టబోయే కార్యక్రమాలు వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆరిలోవలో గల ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశం లో కొన్ని భవిష్యత్ ప్రణాళికలు తెలిపారు. పార్టీ అధిష్ఠాన వర్గం తన బాధ అర్థం చేసుకోవాలి అని కోరారు. వైసిపి కార్యక్రమాలకు తనను ఎందుకు పిలవడం లేదు అంటే, కంచర్ల వస్తె జై కంచర్ల అని వెనుక వచ్చే వ్యక్తులు జై కంచర్ల అంటూ నినాదాలు చేస్తున్నారు అందువల్ల ఎమ్మేల్యే అభ్యర్థి పేరు వినిపించడం లేదని వైసిపి వర్గాలు చెబుతున్నాయి అన్నారు. అంతిమంగా తాను మీకే కదా జై కొడతాను అని స్పష్టం చేశారు. పార్టీ ని ముందుకు తీసుకు వెళ్ళాలి అని తాను కృషి చేస్తుంటే, పార్టీలో కొందరు తాను వెనుకడుగు వేసేలా చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వస్తె తన వల్ల పార్టీకి నష్టం ఏమయినా కలుగుతుందా అని ఆయన ప్రశ్నించారు. పిలవని పేరంటానికి వెళ్ళడం బాగోదు అన్నారు. పార్టీ పటిస్తానికి కృషి చేస్తా అంటే వొప్పుకోవడం లేదు. జగన్ కి మంచి ఆదరణ వుంది అని పేర్కొన్నారు.
తూర్పు నియోజక వర్గం సీటు గెలిచి సీ ఏం జగన్ కు కానుక ఇవ్వాలని వుంది. ఏం వీ వీ, కార్పొరేటర్లు పరిస్తి తులు గమనించాలి. కలిసి కట్టుగా పనిచేస్తేనే తూర్పులో వైసిపి జెండా ఎగురుతుంది అన్నారు. వైసిపి లో చేరిన మొదటి రోజే ముఖ్యమంత్రి జగన్ కు కూడా తాను ఇదే చెప్పాను. పార్టీ లో కొందరి వైఖరి వైసిపి విశాఖ ఏం పి అభ్యర్థి ఝాన్సి గెలుపు మీద కూడా ప్రభావం పడుతుంది అన్నారు. ఝాన్సి నాన్ లోకల్ అని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు అని, ఆమె విశాఖలో స్థానిక అభ్యర్థి అని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర వలస ప్రజలు అంతా జాన్సికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కంచర్ల వైసిపి లోకి వస్తె పార్టీ పటిష్ఠం అవుతుంది మొదట్లో అన్నారు. అమర్ హత్య కేసులో నిందితురాలైన రాలు అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేయడం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించడం అని పార్టీ వర్గాలు ఫిర్యాదు చేస్తున్నాయి అనగా తప్పు చేస్తే ఏ పార్టీ వారయినా ఎవరినైనా శిక్షించాలి అని స్పష్టం చేశారు. జగన్ అమలు చేసిన పథకాలు బాగుండడం వల్లనే తాను వైసిపి లో చేరాను అని తెలిపారు.
