విజయవాడ22 ఏప్రిల్ ఏపీలో నామినేషన్ల ) పర్వం కొనసాగుతోంది. ఈనెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలవగా.. ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (, లోకేష్ , బాలయ్య ( ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి i) ఇలా ప్రముఖులు సహా అనేక మంది నామినేషన్లు వేసేశారు. ఈరోజు (సోమవారం) తూర్పు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గా గద్దె రామ్మోహన్ () నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కోసం పటమట లంక నుంచి వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. భారీ ర్యాలీగా వెళ్లి గద్దె రామ్మోహన్ నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే పటమట లంక నుంచి భారీ ర్యాలీ మొదలైంది.
