అమరావతి (ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రజలకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆదివారం పలు చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నంద్యాల జిల్లా చాగలమర్రి, తిరుపతి జిల్లా రేణిగుంటలో 45.5°డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.8°, అనంతపురం జిల్లా తరిమెలలో 44.2 , కడప జిల్లా బలపనూరులో 43.8, అనకాపల్లి జిల్లా రావికమతంలో 43.8, పల్నాడు జిల్లా రావిపాడులో 43.8°, నెల్లూరు జిల్లా కసుమూరులో 43.7°, పార్వతీపురంమన్యం జిల్లా కొమరాడలో 43.6, విజయనగరం జిల్లా ధర్మవరంలో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 36 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 82 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది.
