విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 7(హిం.స): విశాఖలోని 37వ వార్డు కొత్త ఆగ్రహారం కాలనీ స్కీం బిల్డింగ్స్ స్థానికులు సుమారు 100మంది వాసుపల్లి సమక్షంలో వైసిపిలో చేరారు. ఆశీలమెట్ట వాసుపల్లి కార్యాలయంలో 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానకిరామ్ ఆధ్వర్యంలో వాసుపల్లి గణేష్ కుమార్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. వాసుపల్లి గణేష్ కుమార్ తమకు ఎంతో సేవ చేశారని, మా కుటుంబంలో చాలామందికి ఆర్థిక సహాయ సహకారాలు అందించారన్నారు. మా ప్రాంతంలో ఉన్న పోలేరమ్మ కొత్తమ్మ వారి ఆలయం పునర్నిర్మానం చేయాలని కోరమన్నారు. అడిగిన వెంటనే మళ్లీ వైసీపీ ప్రభుత్వంలో తప్పకుండా ఆలయాన్ని పునర్నిర్మానం చేస్తామని వాసుపల్లి గణేష్ కుమార్ హామీ ఇవ్వడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. దక్షిణంలో వైసిపి జెండా అఖండ మెజార్టీతో ఎగరేస్తామని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు గనగళ్ల రామరాజు, స్థానికులు కొవ్వూరి శరత్, కోనాడమంగా, కండిపల్లి వెంకటలక్ష్మి, తదితరులు ఉన్నారు.
