కూచ్ బిహార్05 ఏప్రిల్అ వినీతిపరులను రక్షించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, తాము మాత్రం వారిని శిక్షించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. వచ్చే అయిదేళ్లలో అక్రమార్కులపై ఇప్పటి కంటే కఠినమైన చర్యలుంటాయని హెచ్చరించారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బిహార్‌లో గురువారం నిర్వహించిన మెగా ర్యాలీలో ఆయన ప్రసంగించారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై విపక్ష ఇండియా కూటమి దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. భారత మాతపై విశ్వాసం ఉన్న వారికి దేశ పౌరసత్వం మంజూరు చేయడం మోదీ ఇచ్చిన వాగ్దానమన్నారు. సందేశ్‌ఖాలీలో లైంగికవేధింపుల దోషులందరూ తమ శేషజీవితాన్ని జైలులో గడపటం ఖాయమన్నారు.
