తెలంగాణ: బిజినెస్: ఏప్రిల్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల లాభాల జోరుకు బ్రేక్ పడింది. మూడు రోజుల పాటు వరుసగా లాభపడిన సూచీలు.. మంగళవారం నాటి ట్రేడింగ్లో నష్టాలు చవిచూశాయి. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు, గరిష్ఠాల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు దిగడం వంటివి ఇందుక్కారణం. అమెరికాలో తాజాగా వెలువడిన గణాంకాలు వడ్డీ రేట్ల కోత ఆలస్యం కావొచ్చన్న ఆందోళనలు పెంచాయి. ఈ ప్రభావం ఐటీ స్టాక్ మార్కెట్ పై పడింది.సెన్సెక్స్ 74,022.30 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమై తర్వాత నష్టాల్లోకి జారుకుంది. రోజంతా అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 73,743.77 74,099.78, 110.64 పాయింట్లు కోల్పోయి 73,903.91 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 8.70 నష్టపోయి 22,453 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.39 గా నమోదయింది.
