ఆంధ్రప్రదేశ్ 27మార్చ్ఫ్యా షన్ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మంగా భావించే మిస్ యూనివర్స్ ) పోటీలకు సౌదీ అరేబియా సిద్ధమైంది.
రూమీ అల్కహ్తాని అనే 27ఏళ్ల అందాల భామ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రూమీ వెల్లడించారు. అంతర్జాతీయ వేదికగా జరిగే ఓ అందాల పోటీల్లో పాల్గొనే తొలి సౌదీ యువతిగా నిలవనుంది.
73వ మిస్ యూనివర్స్ పోటీలు సెప్టెంబర్ 28, 2024న మెక్సికోలో నిర్వహించనున్నారు. ఇందులో సౌదీ అరేబియా తొలిసారి భాగస్వామ్యం కానుంది. రియాద్‌కు చెందిన రూమీ అల్కహ్తాని ఈ పోటీల్లో అధికారికంగా పాల్గొననున్నారు. ఇటీవల మలేసియాలో నిర్వహించిన మిస్ అండ్ మిసెస్ గ్లోబల్ ఏసియన్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె.. ప్రపంచ సంస్కృతుల గురించి తెలుసుకోవడంతోపాటు సౌదీ సంప్రదాయ, వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే తన ప్రయత్నమని అన్నారు.
