విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), మార్చి 19 విశాఖపట్టణం జిల్లా నూతన డీఐపీఆర్వోగా ఎస్.వి. రమణ సోమవారం సాయంత్రం సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జునను తన ఛాంబర్లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఎస్.వి. రమణ ఇప్పటి వరకు విజయనగరం జిల్లా సమాచార పౌర సంబంధాల కార్యాలయంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ గా విధులు నిర్వహించారు. విశాఖపట్టణం జిల్లా నూతన డీఐపీఆర్వో(ఎఫ్.ఎ.సి.)గా సోమవారం విధుల్లో చేరారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో పని చేసిన వి. మణిరామ్ విశాఖపట్టణం ఆర్జేడీ (ప్రాంతీయ సంయుక్త సంచాలకులు) హోదాలో తన స్థానానికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, సిబ్బంది ఇద్దరి అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.
