దిల్లీ,15,మార్చి కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుఖ్బీర్ సింగ్ సంధూ , జ్ఞానేశ్ కుమార్లను ప్రధాని మోడీ కమిటీ నిన్న ( గురువారం ) నియమించింది. అయితే, తాజాగా వీరు ఈసీఐలో జాయిన్ అయ్యారు. కమిషనర్లుగా ఇవాళ (శుక్రవారం) ఉదయం అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి రాజీవ్ కుమార్ చీఫ్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కమిషనర్గా ఉన్న అనూప్ చంద్ర పాండే గత నెలలో పదవీ విరమణ చేశారు.. మరో కమిషనర్ అరుణ్ గోయెల్ ఇటీవలే అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త కమిషనర్ల నియామకాన్ని గురువారం నాడు ప్రధాని మోడీ నేతృత్వంలో సమావేశమైన కమిటీ సుఖ్బీర్ సింగ్ సింధూ, జ్ఞానేశ్ కుమార్లను ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా వీరు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలను చేపట్టారు.
