విజయవాడ: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అఖండ విజయం సాధించబోతుందని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ పార్లమెంట్ ఇంచార్జ్ కేశినేని చిన్ని ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటు పరిధిలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి క్లిన్ స్వీప్ చేయబోతుందని ఆయన చెప్పారు. టీడీపీ పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష అని అన్నారు. ఎక్కడ అయితే పేద ప్రజలు ఉన్నారో అక్కడ టీడీపీ మ్యానిఫెస్టో వివరించాలి అని కార్యకర్తలకు సూచించారు. టీడీపీ పేదల పార్టీ అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పేద ప్రజలకు సుపరిపాలన అందించడమే చంద్రబాబు నినాదం అని తెలిపారు. రాజకీయాల్లో సేవాగుణం కలిగిన వ్యక్తి గద్దె రామ్మోహన్ అని చెప్పారు. ఈ క్రమంలో కేశినేని నాని కోవర్టు అంటూ చిన్ని విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉంటే లోకేష్ ఎక్కడ ఉన్నాడు.. ఎవరితో మాట్లాడుతున్నాడు అనే విషయాలను జగన్‌కు చేరవేశాడని ఆరోపించారు.
