నూతన జంట రకుల్ ప్రీత్ సింగ్-జాకీభగ్నానీకి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన వారికి ఒక లేఖను పంపించారు. తన బిజీ షెడ్యూల్ కారణంగా వివాహానికి హాజరుకాలేకపోయానని ఆ లేఖలో పేర్కొన్నారు. నూతన దంపతులకు తన ఆశీర్వాదాలు అందజేశారు. తనను వివాహానికి ఆహ్వానించినందుకు రకుల్ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు. కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ పంపిన లేఖను రకుల్‌ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ స్వయంగా తమతమ అధికారిక ఎక్స్ (X) ఖాతాల్లో షేర్ చేశారు. ‘మా సరికొత్త ప్రయాణంలో మీ ఆశీర్వాదాలు మా హృదయాలను తాకాయి. మీ ఆశీర్వాదాలు మాకెంతో విలువైనవి. ధన్యవాదాలు’ అంటూ రకుల్, జాకీ ఇద్దరూ ట్వీట్స్ ద్వారా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దాంతో వారి ట్వీట్స్ వైరల్‌గా మారాయి.
